
కేసీఆర్‌కు ఓటేసి మరోసారి మోసపోవద్దని గొల్లపల్లి గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు YSRTP అధ్యక్షురాలు షర్మిల. పాదయాత్రలో భాగంగా గొల్లపల్లి గ్రామస్థులతో మాట ముచ్చట నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను KCR మోసం చేశారని ఆరోపించారు. ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా KCRలో చలనం లేదన్నారు. ఉన్నత చదువులు చదివిన పిల్లలు బర్లు, గొర్లు కాయాలా అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ TRS కు అమ్ముడుపోయిందని, ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లో ఉండరంటూ విమర్శించారు షర్మిల.