తెలంగాణలో అసలు ఉద్యమం ఇప్పుడే మొదలైంది

తెలంగాణలో అసలు ఉద్యమం ఇప్పుడే మొదలైంది

 హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుత స్థితిగతులు ఉద్యమ లక్ష్యాలకు దరిదాపులుల్లో కూడా లేవని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రం వచ్చి ఏడేళ్లు అయినా యువకులకు చావే దిక్కని అనుకుంటున్నారని చెప్పారు. ప్రతి నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని.. కానీ పాలకులు వారి నుదుటపై మరణ శాసనం రాస్తున్నారని విమర్శించారు. అసలు ఉద్యమం చేయాల్సి ఉందని, ఇంకా పోరాడి సాధించుకోవాల్సింది చాలా ఉందన్నారు.

'రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అయ్యింది. కోట్లాది మంది తెలంగాణ ప్రజలకు ఇది పండుగ రోజు. ఎంత మంది ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం కళ్లు తెరుస్తుంది? సీఎం తన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారు, వీళ్లకు ఎందుకు ఇవ్వరు? ఆ ఛాతీలో ఉన్నది గుండెనా? బండనా? దేశంలో ఉన్న నిరుద్యోగుల్లో తెలంగాణలోనే అత్యధికులు ఉన్నారు. నిరుద్యోగ భృతి ఏమైంది? కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాల్సిన అవసరం ఉంది' అని షర్మిల పేర్కొన్నారు.