అవ్వ పెట్టదు.. అడక్క తిననీయదు

అవ్వ పెట్టదు.. అడక్క తిననీయదు

హైదరాబాద్: పంటల బీమా పాలసీని తెస్తామని గొప్పగా చెప్పిన సీఎం కేసీఆర్.. ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదని వైఎస్సార్‌ టీపీ అధినేత్రి షర్మిల ప్రశ్నించారు. అటు కేంద్ర బీమా వర్తించక.. ఇటు రాష్ట్ర బీమా దిక్కులేక రైతులు కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. అన్నదాతలు నష్టాల పాలవుతున్నారని.. ఇప్పుడైనా కేసీఆర్ మేలుకోవాలన్నారు. అవ్వ పెట్టది అడక్కు తిననీయదన్నట్లు కేసీఆర్ దొర తీరు ఉందని విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 5 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు నష్టపోయారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన నుంచి తెలంగాణ ప్రభుత్వం గతేడాది తప్పుకుంది.