హైదరాబాద్​లో షర్మిల ఆఫీసు

హైదరాబాద్​లో షర్మిల ఆఫీసు

బిల్డింగ్ వెతుకుతున్న నేతలు

హైదరాబాద్, వెలుగు: పార్టీ ఏర్పాటులో భాగంగా బుధవారం వైఎస్ షర్మిల పలువురు నేతలతో భేటీ అయ్యారు. ఈ  మీటింగ్ లో జిల్లాల్లో నేతలతో సమావేశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. బుధవారం ఆమె వైసీపీ ఏర్పాటు నుంచి కీలకంగా ఉన్న రంగారెడ్డి జిల్లా నేత కొండా రాఘవరెడ్డితో పాటు పలువురితో సమావేశమయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా నేతలతో ఆత్మీయ సమ్మేళనాలు, మీటింగ్​లు పెట్టాలనే విషయంపై చర్చించారు. ఈ నెల 20న ఖమ్మం జిల్లా అభిమానులతో షర్మిల మీటింగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మీటింగ్ ఖమ్మంలో జరుగుతుందా లేక లోటస్ పాండ్ లో ఉంటుందా అనే విషయంపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. అలాగే హైదరాబాద్ లో పార్టీ ఆఫీసు ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిటీలో ఆఫీసు కోసం బిల్డింగ్ చూడాలని నేతలకు షర్మిల చెప్పినట్లు సమాచారం.

ఘనంగా బ్రదర్ అనిల్ బర్త్ డే

షర్మిల భర్త బ్రదర్ అనిల్ బర్త్ డే వేడుకలు లోటస్ పాండ్ లో బుధవారం ఘనంగా జరిగాయి.  కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఏర్పాటుపై జిల్లాల నుంచి ఫోన్లు వస్తున్నాయన్నారు.రోజూ మీటింగ్‌లు పెట్టి జిల్లాల నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని, ఈ ప్రాసెస్ 45 రోజులు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల మీటింగ్ ఇక్కడే ఉంటుందని… ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు స్వయంగా షర్మిల వెళ్లే ఆలోచన ఉందని…  రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పారు.