నేడు షర్మిల పార్టీ ప్రకటన

నేడు షర్మిల పార్టీ ప్రకటన
  • హైదరాబాద్‌‌ జేఆర్సీ కన్వెన్షన్‌‌ సెంటర్‌‌లో ఏర్పాట్లు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ మాజీ సీఎం వైఎస్సార్‌‌ జయంతి సందర్భంగా ఆయన కూతురు వైఎస్‌‌ షర్మిల గురువారం తన పార్టీ పేరు, జెండా, విధివిధానాలను ప్రకటించనున్నారు. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌‌లో జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇదీ షెడ్యూల్ 
గురువారం ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలో వైఎస్సార్‌‌ సమాధి వద్ద పార్టీ జెండాను పెట్టి షర్మిల నివాళులు అర్పిస్తారని ఆమె అనుచరులు చెబుతున్నారు. అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్‌‌లో మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్ పోర్టుకు షర్మిల చేరుకుంటారు. అక్కడి నుంచి భారీ ర్యాలీతో వెళ్లి పంజాగుట్టలో 
వైఎస్సార్‌‌ విగ్రహానికి పూలమాలలు వేస్తారు. అటు నుంచి మసాబ్‌‌ట్యాంక్, మెహిదీపట్నం, టౌలిచౌకి, షేక్‌‌పేట మీదుగా జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌‌కు  3 గంటలకు చేరుకుంటారు.


6 గంటల వరకు పార్టీ ప్రకటన, జెండా, విధివిధానాలపై ప్రసంగిస్తారు. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల వివాదం, వైఎస్‌‌‌‌ఆర్, వైఎస్ జగన్‌‌‌‌పై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తుం డటంతో గురువారం నాటి ప్రోగ్రాంలో షర్మిల ఎలా స్పందిస్తారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.  అయితే ఇటు షర్మిల పార్టీ సక్సెస్  కావాలని బుధవా రం చిలుకూరు బాలాజీ టెంపుల్‌‌‌‌లో ఆమె అనుచరులు కొండా రాఘవరెడ్డి, పిట్టా రాంరెడ్డి, వైఎస్ఆర్ ఫ్యాన్స్ పూజలు చేశారు. తర్వాత జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌‌‌‌లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 4 వేల మంది ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో చూసేందుకు అన్ని లోక్‌‌‌‌సభ నియోజకవర్గాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు ఆమె అనచరులు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ప్రజలు సంతోషంగా లేరని, అందుకే పార్టీ పెడుతున్నామని కొండా రాఘవరెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామన్న నేతలు వాళ్ల కుటుంబాలను బంగారం చేసుకున్నారని ఆరోపించారు. 
లోటస్ పాండ్‌‌‌‌లో షర్మిల స్ట్రాటజిస్ట్ 
షర్మిల స్ట్రాటజిస్ట్ ప్రియా రాజేంద్రన్ బుధవారం లోటస్ పాండ్ చేరుకున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమం, స్పీచ్, విధివిధానాలపై తన టీమ్ మెంబర్లతో ప్రియా  చర్చించినట్లు తెలిసింది. తమిళనాడు డీఎం కే ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురైన ప్రియా.. పొలిటిక ల్ స్ట్రాటజిస్ట్ పీకే టీమ్‌‌‌‌లో పనిచేశారు. ఇటీవల ఆమె ను తన స్ట్రాటజిస్ట్‌‌‌‌గా షర్మిల నియమించుకున్నా రు. రానున్న రోజుల్లో షర్మిలకు అన్ని విషయాలపై ప్రియ సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.