
రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందకు దివంగత సీఎం వైెఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటిస్తూ… ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం ఆమె పాలమూరు జిల్లాలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… కోహినూర్ వజ్రం పుట్టిన పాలమూరు జిల్లా నేడు వలసలకు జిల్లాగా మారిందని వ్యాఖ్యానించారు. గల్ఫ్ లో రాష్ట్రానికి చెందిన వలస కూలీలు 150 మంది గల్లంతయ్యారన్న వార్త విని గుండె తరుక్కు పోయిందన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 80 ,90 శాతం ప్రాజెక్టులు రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని, మిగిలిన భీమ,నెట్టెంపాడు,కల్వకుర్తి,కోయిల సాగర్ ప్రాజెక్టులను ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎందుకు పూర్తి చేయలేక పోయారని ప్రశ్నించారు.