
- తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసినవ్.. కవితపై షర్మిల ఫైర్
హైదరాబాద్, వెలుగు: ‘‘అమ్మ కవితమ్మ.. అత్త మీది కోపం దుత్త మీద చూపినట్టు ఉంది నీ వ్యవహారం. నీ బండారం బట్టబయలైతే, అవి మీడియా టెలికాస్ట్ చేస్తే.. జర్నలిస్టులకు, మీడియా సంస్థలకు విలువ ల్లేవని అంటావా? నీకు ఏం విలువ ఉన్నట్లు? బతుకమ్మ ముసుగులో లిక్కర్ దందా చేసినవ్. తెలంగాణ ఆడబిడ్డల ఇజ్జత్ తీసినవ్.. బురదచల్లడం అంటే ఏంటో జర చెప్పమ్మా.. లిక్కర్ స్కామ్‌లో రోజుకో ఎపిసోడ్ బయటపడుతున్నది. నిజాలు రాయకుండా.. లిక్కర్ స్కామ్‌తో ఘనకార్యం చేసినవ్ అని నెత్తినపెట్టుకోవాలా..?”అని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల కవితను ప్రశ్నించారు.
లిక్కర్ స్కామ్‌లో ఇరుకున్న నీ గురించి ఆహా.. ఓహో.. అని భజన చేస్తూ వార్తలు రాయాలా? అని గురువారం ట్వీట్లో ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డ నిన్ను సస్పెండ్ చేయకుండా రాచమర్యాదలతో కేసీఆర్ ప్రగతి భవన్లో స్వాగతం పలికారని విమర్శించారు. బిడ్డను కాపాడుకునేందుకు ఢిల్లీ వీధుల్లో తిరిగారని గుర్తు చేశారు. అవినీతికి పాల్పడకపోతే పదవికి రాజీనామా చేసి, ప్రజల ముందు నిజాయితీని నిరూపించుకో అని కవితకు షర్మిల సవాల్ విసిరారు.