
నగరి ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. పుత్తురూ మండలం కేబీఆర్ పురంలో గ్రామ సచివాలయం ప్రారంభోత్సవానికి వెళ్లిన రోజాను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెండో సారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని, పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవడం లేదని నిలదీశారు. రోజా కారుకు అడ్డంగా నిలబడి ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపు కారును ముందుకు వెళ్లనివ్వలేదు. రోజా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. దీంతో పోలీసులు వచ్చి గ్రామస్థులకు సర్ది చెప్పారు. సచివాలయం శంకుస్థాపన చేసిన రోజా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.