
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు. గలీజు మాటలు, గందరగోళ పాలనతో రైతులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు. నీళ్లు ఉన్నా వరి పండించలేని దుస్థితి నెలకొందన్నారు. యాసంగిలో ఏ పంట వేయాలో ఇప్పటిదాకా చెప్పలేదని.. దొర ఏం చెప్తాడో తెలియక అన్నదాతలు సందిగ్ధంలో ఉన్నారని షర్మిల ట్వీట్ చేశారు.
అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారైంది రైతుల పరిస్థితి. దొరగారి గలీజు మాటలు
— YS Sharmila (@realyssharmila) December 1, 2021
గందరగోళ పాలనతో అరిగోస పడుతున్నారు.
నీళ్లు ఉన్నా గాని వరి పండించలేని దుస్థితి.
యాసంగిలో వరి వేస్తే ఉరే-వరి కొననన్న కేసీఆర్ గారు,
ఏం పంటలు వేయాలో మీరే చెప్తానన్నారు. ఇప్పటివరకు చెప్పింది లేదు.1/2 pic.twitter.com/3965m4LmeD
దొడ్డు బియ్యం కాదు సన్నాలని చెప్పి వాటిని కొనలేదని షర్మిల ఫైర్ అయ్యారు. ఆ తర్వాత మక్కలు, జొన్నలు అని, వాటికి ఎంఎస్పీ ఇచ్చింది లేదన్నారు. ప్రత్యామ్నాయ పంటలంటున్నా .. కొంటారన్న గ్యారెంటీ, మద్దతు ధర ఇస్తారన్న నమ్మకం లేదన్నారు. చేతకాని సారు, బాతకాని జోరుకు రైతులు బేజారు అవుతున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.