షర్మిల పాదయాత్రకు అనుమతివ్వండి : వరప్రసాద్

షర్మిల పాదయాత్రకు అనుమతివ్వండి : వరప్రసాద్

వైఎస్ఆర్టీపీ లీగల్ టీమ్ సభ్యులు వరంగల్ సీపీ రంగనాథ్‭ను కలిశారు. షర్మిల పాదయాత్ర పై పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసుకు లీగల్ టీమ్ వివరణ ఇచ్చింది. షర్మిల పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని.. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని వైఎస్ఆర్టీపీ లీగల్ సెల్ చైర్మన్ వరప్రసాద్ అన్నారు. హైకోర్టు ఆదేశాలతో అనుమతి కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేశామని చెప్పారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోగా.. ఎందుకు అనుమతి ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారని సీపీకి వివరించారు. షోకాజ్ నోటీసుకి కోర్టు ఆదేశాలతో కూడిన వివరణ ఇచ్చామని ఆయన తెలిపారు. 

సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన గైడ్ లైన్స్‭ను పోలీసులు పాటించలేదని వైఎస్ఆర్టీపీ చైర్మన్ వరప్రసాద్ అన్నారు. దీనిపై వరంగల్ సీపీ రెండు రోజుల సమయం అడిగారని ఆయన చెప్పారు. షర్మిల పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని వరప్రసాద్ స్పష్టం చేశారు.