పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి : బీబీ పాటిల్

పెండింగ్ విభజన హామీలను నెరవేర్చండి : బీబీ పాటిల్
  •     కేంద్రానికి బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ వినతి 

న్యూఢిల్లీ, వెలుగు :  విభజన చట్టం-2014కు సంబంధించిన పెండింగ్ హామీలను వెంటనే నెరవేర్చాలని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కోరారు. సోమవారం ఆయన లోక్ సభలో సప్లమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అంశంపై జరిగిన చర్చలో భాగంగా మాట్లాడారు. విభజన చట్టంలోని హామీలు, కాళేశ్వరం లేదా పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల్లో  ఒక ప్రాజెక్ట్ కు జాతీయ హోదా, తెలంగాణ అసెంబ్లీ సీట్లు119 నుంచి 153కు పెంపు వంటి అంశాలను సత్వరమే పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు.

జహీరాబాద్ నిమ్జ్ కు ఫండ్స్ కేటాయింపు, కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ప్రతి జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు, టీఐఈఎస్ కింద జడ్చర్ల కు గ్యాస్ అకేషన్, ఆదిలాబాద్ లో సిమెంట్ ఫ్యాక్టరీ రీ ఓపెన్, హైదరాబాద్ ఫార్మా సిటీ కి ఫండ్స్ రిలీజ్, వరంగల్ మెగా టెక్స్ టైల్స్ పార్క్ కు కేంద్ర సపోర్ట్, సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్ కేటాయింపు, ఐటీఐఆర్ రీ కన్సిడరింగ్, ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి  పాటిల్ విజ్ఞప్తి చేశారు.