Job News: జిప్ మర్ లో రెసిడెంట్ ఉద్యోగాలు

Job News: జిప్ మర్ లో  రెసిడెంట్ ఉద్యోగాలు

జవహర్​లాల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్​గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 15. 
పోస్టులు: 100 (సీనియర్ రెసిడెంట్) 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డీఎన్​బీ, ఎంఎస్ లేదా ఎండీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి45 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 20.
లాస్ట్ డేట్: జులై 15. 
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1200, జనరల్/ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులరూ. 1500.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
హాల్ టికెట్స్ డౌన్ లోడ్: జులై 21.
ఎగ్జామ్ డేట్: జులై 27.
పూర్తి వివరాలకు jipmer.edu.in వెబ్​సైట్​లో చూడగలరు.