మామూలు తెలివి కాదు : జొమాటో ఆర్డర్ చెయ్యి.. రూ.2 వేల నోటు పడేయ్..

మామూలు తెలివి కాదు : జొమాటో ఆర్డర్ చెయ్యి.. రూ.2 వేల నోటు పడేయ్..

రూ.2వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన వెలువరించిన నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ అప్లికేషన్ జొమాటో రికార్డు డెలివరీ ఆర్డర్ లను అందుకుంది. ప్రకటన వచ్చినప్పట్నుంచి 72శాతం క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ లు రూ.2వేల నోట్లతో చెల్లించబడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

రూ.2వేల నోట్లను సెప్టెంబర్ 30, 2023లోగా లేదా అంతకుముందు డిపాజిట్ చేయాలని లేదా మార్చుకోవాలని కేంద్రం ఇటీవలే వెల్లడించింది. ఆర్బీఐ కూడా ఈ విషయంపై నిర్ణయం తెలపడంతో ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను మార్చుకోవడానికి బ్యాంకులకు పరుగెత్తుతున్నారు. తమ వద్ద ఉన్న కరెన్సీ నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక మరికొందరు ఆందోళనలకు గురవుతున్నారు.

https://twitter.com/zomato/status/1660530725299314693