
ఫేమస్ అస్సామీ సింగర్ జుబీన్గార్డ్ డెత్ మిస్టరీ కేసు కీలక మలుపుతిరిగింది. ఈకేసులో ప్రముఖ సంగీత దర్శకుడు శేఖర్ జ్యోతి గోస్వామిని సిట్అధికారులు అరెస్టు చేశారు. జుబీన్ గార్గ్ చనిపోయిన సమయంలో ప్రత్యక్ష సాక్షిగా శేఖర్ జ్యోతి ఉన్నాడు. గురువారం (సెప్టెంబర్25) శేఖర్ జ్యోతి గోస్వామిని విచారణ కోసం సిట్అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే జుబీన్ గార్గ్మిస్టీరియస్ కేసులో శేఖర్ గోస్వామిపై పాత్రపై ఎటువంటి వివరాలు సిట్బృందం వెల్లడించలేదు.
మరోవైపు ప్రముఖ వ్యాపార వేత్త, కల్చరల్ యాక్టివిస్ట్ శాంఖను మహంత కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కోనున్నారు. శాంకను మహంత ను కూడా త్వరలో సిట్ అధికారులు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. గురువారం ఉదయం మహంతా నివాసంలో సోదాలు చేశారు. అయితే సోదాలో ఏమైన ఆధారాలు దొరికాయా అనే దానిపై సిట్ అధికారులు వివరాలు వెల్లడించలేదు.
►ALSO READ | అలా ఎలా మింగావు బ్రో.. కడుపులో స్పూన్లు, బ్రష్లు, పెన్నులు చూసీ డాక్టర్లు షాక్.. !
ఈ కేసులో మరికొంతమందిని కూడా సిట్ విచారించే అవకాశంఉంది. సింగపూర్ అస్పాం అసోసియేషన్ సభ్యులను కొంతమందిని విచారించనుంది సిట్ బృందం. విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.. మరికొంతమంది అరెస్ట్అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఏంటీ కేసు..?
సెప్టెంబర్ 19న ప్రముఖ అస్సామి సింగర్ జుబీన్ గార్గ్ సింగపూర్ లో సముద్రం స్విమ్మింగ్ చేస్తూ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గార్గ్ మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మంగళవారం పాపులర్ సింగర్ గార్గ్ అంత్యక్రియలు గౌహతిలో అస్సాం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించింది.