ప్రియాంక మోహన్, దక్షిణ కొరియా నటుడు పార్క్ హై-జిన్ (‘స్క్విడ్ గేమ్’ ఫేమ్) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘మేడ్ ఇన్ కొరియా’. రా.కార్తిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రైజ్ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. తమిళనాడులోని ఓ టౌన్‌కు చెందిన శెన్బాకు దక్షిణ కొరియాకు వెళ్లాలనేది డ్రీమ్. తన కొరియా ప్రయాణమే ఈ చిత్ర ప్రధాన కథ.
మార్చి 12 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రా.కార్తిక్ మాట్లాడుతూ ‘కొరియన్, తమిళ సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాల ప్రేరణతో ఈ చిత్రం రూపొందించాను’ అని చెప్పాడు. భాషల్ని దాటి ప్రపంచ సంస్కృతులను కలుపుతున్న ఇలాంటి ఓ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని ప్రియాంక మోహన్ చెప్పింది.
