Pathaan:వెయ్యి కోట్లు వసూలు చేసిన పఠాన్

Pathaan:వెయ్యి కోట్లు వసూలు చేసిన  పఠాన్

బాలీవుడ్ బాద్షా నటించిన పఠాన్ విడుదైనప్పటి నుంచే బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ.. అనేక రికార్డులను తిరగరాసింది. తాజాగా మరో రికార్డును దక్కించున్న ఈ సినిమా... రూ.1000 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ విషయాన్ని బాక్సాఫీస్ కలెక్షన్స్ ట్రాకర్ బాక్స్ ఆఫీస్ ఇండియా ట్విట్టర్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఒక్క సాంగ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం.. జనవరి 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రల్లో నటించారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కోట్లల్లో కలెక్షన్లు వసూలు చేసింది. కాగా ఇప్పటికే  దేశీయ బాక్సాఫీస్ కలెక్షన్ పరంగా రూ.623 కోట్లు రాబట్టిన ఈ ఫిల్మ్.. అమీర్ ఖాన్ 'దంగల్' (రూ. 2,070.30 కోట్లు), ప్రభాస్, అనుష్క శెట్టిల ఫాంటసీ ఎపిక్ 'బాహుబలి 2: ది కన్‌క్లూజన్' (రూ. 1,788.06 కోట్లు), ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'కేజీఎఫ్: చాప్టర్ 2' (రూ. 1,208 కోట్లు), రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ (రూ. 1,170 కోట్లు).. తర్వాత ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఐదో చిత్రంగా పఠాన్ నిలిచింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నాలుగో స్థానానికి రావాలంటే మరో రూ.200 కోట్ల వరకూ రాబట్టాల్సి ఉంది. అయితే విడుదలైన 27 రోజులకే పఠాన్.. ఇంత మొత్తంలో వసూలు చేయడం చెప్పుకోదగిన విషయం.