రష్యా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఖర్కీవ్

రష్యా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఖర్కీవ్

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడుల్లో ఖర్కీవ్ సిటీ ఎక్కువగా దెబ్బతింది. రష్యన్ అటాక్స్ తో ఈ నగరంలో తీవ్ర నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్ పై రష్యన్ బలగాలు మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి. జనావాసాలపై కూడా పలు మిసైళ్లు దూసుకురావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న మోడీ సర్కారు.. ఖర్కీవ్ లో చిక్కుకున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ సిటీలో ఉన్న భారతీయుల్లో అత్యధిక మందిని స్వదేశానికి విజయవంతంగా తరలించామని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. 

‘ఖర్కీవ్, పిసోచిన్ లో ఉన్న భారత పౌరులను సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే ఖర్కీవ్ సిటీ నుంచి అత్యధికులను ఇండియాకు తరలించాం’ అని భారత ఎంబసీ ట్వీట్ చేసింది. ఇంకా ఉక్రెయిన్ లో మిగిలిపోయిన భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆదివారం పిసోచిన్ లో ప్రత్యేక బస్సులను మోడీ ప్రభుత్వం సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తోందని తెలిపింది.

మరిన్ని వార్తల కోసం:

యుద్ధ సమయంలో కీలక నిర్ణయం తీసుకున్న కమలా హ్యారిస్

8 నుంచి పెట్రోల్ మోత తప్పదా?