
న్యూఢిల్లీ: ఈ నెల 8 నుంచి దశల వారీగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుకోవడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రాయిటర్స్ పేర్కొంది. ఈ నెల 7 తో అసెంబ్లీ ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో రేట్లను పెంచడం కంపెనీలు తిరిగి స్టార్ట్ చేస్తాయని తెలిపింది. కిందటేడాది నవంబర్ నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగకుండా ఉన్నాయి. కానీ, ఇదే టైమ్‌లో గ్లోబల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ రేటు 40 % ఎగిసింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ. 10–12 వరకు పెంచాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కంపెనీలు ప్రభుత్వానికి వివరించాయని ఈ సంస్థ వివరించింది. రేట్లను కంట్రోల్ ఉంచడానికి ఏప్రిల్‌లో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని పేర్కొంది.