జనవరి 6న రెడ్‌మి కొత్త స్మార్ట్ ఫోన్.. ట్రెండ్ సెట్ చేస్తున్న స్టైలిష్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్

జనవరి 6న రెడ్‌మి కొత్త స్మార్ట్ ఫోన్.. ట్రెండ్ సెట్ చేస్తున్న స్టైలిష్ డిజైన్, అదిరిపోయే ఫీచర్స్

చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమి కంపెనీ కొత్తగా రెడ్‌మి నోట్ 15 5G ఫోన్‌ సహా రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G టాబ్లెట్‌ను ఇండియాలో లాంచ్ చేయబోతుంది. దీనిని జనవరి 6న ఉదయం 11:30 గంటలకు ఢిల్లీలో జరిగే ఓ ఈవెంట్‌ ద్వారా విడుదల చేయనుంది. అప్పుడే దీని  ధర, బుకింగ్, సేల్స్ వివరాలు తెలుస్తాయి... 

రెడ్‌మి నోట్ 15 5G ఫీచర్స్ :
ఈ ఫోన్ చాలా సన్నగా 7.35mm, మెటల్ ఫ్రేమ్‌తో స్టైలిష్‌గా ఉంటుంది. దీనికి కర్వ్డ్ డిస్‌ప్లే ఇచ్చారు.  ఇందులో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. దీనితో 4K వీడియోలు తీసుకోవచ్చు. ఫోటోలు షేక్ అవ్వకుండా ఉండటానికి OIS ఫీచర్ కూడా ఉంది.

6.7 అంగుళాల పెద్ద స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, కళ్ళకు ఒత్తిడి లేకుండా ఉండేలా సర్టిఫికేషన్ కూడా పొందింది. ఈ ఫోన్ 5,520mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు ఒకటిన్నర రోజులు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

►ALSO READ | వాట్సాప్ ప్రతి నెలా 1 కోటి పైగా అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేస్తోంది ?

ఇందులో కొత్త స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ వాడారు, దీనివల్ల ఫోన్ స్పీడ్‌గా పనిచేస్తుంది. ఈ ఫోన్‌కు IP66 రేటింగ్ ఉంది, అంటే దుమ్ము,నీటి  నుండి రక్షణ ఉంటుంది.

రెడ్‌మి ప్యాడ్ 2 ప్రో 5G ఫీచర్స్ : ఇది 12.1 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో వస్తుంది. సినిమా చూసేటప్పుడు మంచి క్వాలిటీ కోసం QHD+ క్లారిటీ, డాల్బీ విజన్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో చాలా పెద్ద 12,000mAh బ్యాటరీ ఉంటుంది. ఎక్కువ సేపు సినిమాలు చూడటానికి లేదా ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టాబ్లెట్‌ని మీరు విడిగా కీబోర్డ్ ఇంకా స్టైలస్ తో కూడా వాడుకోవచ్చు.