వాట్సాప్ ప్రతి నెలా 1 కోటి పైగా అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేస్తోంది ?

వాట్సాప్ ప్రతి నెలా 1 కోటి పైగా అకౌంట్లను ఎందుకు బ్లాక్ చేస్తోంది ?

ఇండియాలో వాట్సాప్ వాడే వారి సంఖ్యా పెరుగుతు వస్తుంది, అలాగే డిజిటల్ మోసాలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. దింతో  వాట్సాప్ కఠిన చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ మోసాలు, డబ్బులు అడగడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే అకౌంట్స్ ని వాట్సాప్ తొలగిస్తోంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అకౌంట్లను  ప్రతి నెల సగటున 98 లక్షల వరకు బ్లాక్ చేస్తోంది. నవంబర్ నెలలో ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం సుమారు 29 లక్షల అకౌంట్స్, గ్రూపులను తొలగించింది. 

అసలు సమస్య ఏంటంటే : వాట్సాప్ అకౌంట్లను బ్లాక్ చేస్తోంది కానీ, ఆ నంబర్ల పూర్తి వివరాలను గోప్యత (Privacy) కారణాల వల్ల బయట పెట్టడం లేదు. దీనివల్ల మోసం చేసిన వాళ్ళని పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతోంది. వాట్సాప్‌లో బ్లాక్ అయిన నంబర్లు వెంటనే టెలిగ్రామ్ వంటి ఇతర యాప్‌లలో ప్రత్యక్షమవుతున్నాయి. ఒకసారి అకౌంట్ క్రియేట్ చేశాక, సిమ్ కార్డ్ ఫోన్‌లో లేకపోయినా వాట్సాప్ పనిచేస్తుంది. దీనివల్ల నేరస్థులను ట్రాక్ చేయడం సవాలుగా మారింది.

లెక్కల ప్రకారం, ఒక నెలలో భారతీయుల నుండి వాట్సాప్‌కు 23 వేల 596 ఫిర్యాదులు వచ్చాయి. కానీ అందులో కేవలం 5% అంటే సుమారు 1,001 ఫిర్యాదులపై మాత్రమే వాట్సాప్ చర్యలు తీసుకుంది. చాలా మంది అకౌంట్ ఎందుకు బ్లాక్ అయిందో తెలియక అప్పీల్ చేసుకుంటున్నారు.

వాట్సాప్  సాఫ్ట్‌వేర్ ద్వారా కొత్తగా రిజిస్టర్ అయ్యేటప్పుడు, మెసేజెస్  పంపే విధానాన్ని బట్టి అంటే ఒకేసారి వందల మందికి మెసేజెస్ పంపడం, ఎవరైనా ఒకరి నంబర్‌పై రిపోర్ట్ చేసినప్పుడు నిఘా ఉంచుతుంది:

వాట్సాప్ అనేది మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో మాట్లాడుకోవడానికి ఇంకా కనెక్ట్ అవడానికి   ఉపయోగించే ఒక ప్రైవేట్ మెసేజింగ్ యాప్. తెలియని నంబర్లు లేదా వ్యక్తుల నుండి వచ్చే లింకులు, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ మెసేజులు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్  చేసినప్పటికీ, మోసగాళ్ల విషయంలో అప్రమత్తత ఉండాలి అని వాట్సాప్  సూచిస్తుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దాదాపు 95% డిజిటల్ మోసాలు, కేసులు వాట్సాప్‌లోనే జరుగుతాయి.