ఆ..చిన్నారుల కోసం నేను స్వెట్టర్ వేసుకోవట్లేదు: రాహుల్ గాంధీ

ఆ..చిన్నారుల కోసం నేను స్వెట్టర్ వేసుకోవట్లేదు: రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దట్టమైన పొగమంచు మధ్య హర్యానాలోని అంబాలాలో కొనసాగుతోంది. అయితే కొన్ని రోజులుగా నార్త్ ఇండియాలో పొగమంచుతో జనం నానా అవస్థలు పడుతున్నారు. విపరీతంగా చలి కూడా పెడుతోంది. అయితే యాత్ర చేపట్టినప్పటి నుంచి రాహుల్ విపరీతమైన చలిలోనూ స్వెట్టర్ వేసుకోకుండా టీ షర్ట్ పైనే యాత్ర కొనసాగిస్తున్నారు. దీనిపై చాలా మంది చర్చించుకున్నారు.  అయితే స్వెట్టర్ వేసుకోకపోవడంపై లేటెస్ట్ గా రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు.  మధ్యప్రదేశ్ లో  జోడో యాత్ర చేసేటప్పుడు ఓ ముగ్గురు పేద చిన్నారులు తన దగ్గరకు చినిగిన బట్టలతో వచ్చారని.. అప్పటి నుంచి తాను కూడా టీ షర్ట్ పైనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
 
‘చలిలో మీరు స్వెట్టర్ ఎందుకు వేసుకోవట్లేదని నన్ను చాలా మంది అడుగుతున్నారు. నేను మధ్యప్రదేశ్ లో యాత్ర చేస్తున్నప్పుడు బాగా చలిపెడుతోంది. ఆ సమయంలో  ఓ ముగ్గురు పేద చిన్నారులు చినిగిపోయిన బట్టలతో నా దగ్గరకు వచ్చారు. చలికి బాగా వణికిపోతున్నారు. అప్పుడే నేను నిర్ణయించుకున్నా.  చలికి వణికిపోయేంత వరకు నేను కూడా స్వెట్టర్ వేసుకోకుండా యాత్ర చేస్తానని. వాళ్లు  చలికి వణుకుతుంటే..  తాను కూడా చలికి వణుకుతానని మెసేజ్ ఇవ్వడానికే అలా చేశా’ అని రాహుల్ చెప్పారు.