న్యూఢిల్లీ: నకిలీ జీఎస్టీ ఇన్‌వాయిస్‌లను, రిజిస్ట్రేషన్‌లను తొలగించేందుకు చేపట్టిన డ్రైవ్‌లో ప్రభుత్వం రూ.44వేల కోట్ల పన్ను ఎగవేతలను గుర్తించింది. ఎగవేతకు పాల్పడిన 29వేల సంస్థలను పట్టుకుంది. మోసపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడి రూ.4,646 కోట్లు ఆదా చేసింది. మొత్తం ఏడున్నర నెలల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో 29వేల నకిలీ సంస్థలను, 44వేల కోట్లకు పైగా జీఎస్టీ పన్ను ఎగవేతలను గుర్తించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉనికిలో లేని/బోగస్ రిజిస్ట్రేషన్‌లను గుర్తించి నకిలీని జారీ చేసేందుకు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ఫలితాలను మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వస్తువులు, సేవల సరఫరా లేకుండా ఈ సంస్థలు ఇన్‌వాయిస్‌లను తయారు చేశాయి.
