బీసీలకు 50%  రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే..లేదంటే ఉద్యమాలు ఉధృతం : ఎంపీ ఆర్.కృష్ణయ్య 

బీసీలకు 50%  రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే..లేదంటే ఉద్యమాలు ఉధృతం : ఎంపీ ఆర్.కృష్ణయ్య 

ట్యాంక్ బండ్, వెలుగు: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టించడమే తన జీవిత లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. బీసీల జనాభా దామాషా ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేన్నారు. విషయాన్ని దాటవేస్తే దశలవారీగా ఉద్యమాలు ఉధృతం అవుతాయని హెచ్చరించారు.

గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి రవీంద్రభారతిలో జరిగిన ఆచార్య సందిరి బాలయ్య గంగపుత్ర 115వ జయంతి ఉత్సవంలో మాట్లాడుతూ.. బీసీల సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని కోరారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో న్యాయమైన వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్​చైర్మన్​మెట్టు సాయికుమార్, జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ సత్యం, వకుళాభరణం కృష్ణమోహన్​తదితరులు పాల్గొన్నారు.