పారామెడికల్ కోర్సుల్లో 10 శాతం EWS రిజర్వేషన్

పారామెడికల్ కోర్సుల్లో 10 శాతం EWS రిజర్వేషన్

పారామెడికల్ కోర్సుల్లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు (EWS) 10 శాతం రిజర్వేషన్లను  వర్తింపచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  BPT, MPT, MSc.(Nursing), P.B.B.Sc.(Nursing) కోర్సుల్లో  ఈ డబ్ల్యూసీ రిజర్వేషన్  అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి వైద్యారోగ్య శాఖ అదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బీపీటీ 69 సీట్లు, ఎంపిటి 6 సీట్లు, ఎంఎస్సి నర్సింగ్ 25 సీట్లు, పిబిబీఎస్సీలో 23 సీట్లు రిజర్వ్ కానున్నాయి. ఇప్పటికే ఎంబిబిఎస్, బీడీఎస్, ఆయుష్, అనుబంధ హెల్త్ సైన్స్, బీఎస్సీ నర్సింగ్ సీట్లలో 10శాతం రిజ్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎంబీబీఎస్ లో  203 సీట్లు, ఇతర పారామెడికల్ కోర్సుల్లోని కాంపిటేంట్ కోటాలో 648 సీట్లు రిజర్వ్ అవుతాయి.