
ప్రయాణికులతో వెళ్తోన్న విమానం కూలిపోయి.. 14 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన బ్రెజిల్‌లో శనివారం (సెప్టెంబర్ 16) నచోటుచేసుకుంది. అమెజాన్ అడవులకు సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బార్సిలోస్ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మృతిచెందినట్టు బార్సిలోస్ గవర్నర్ విల్సన్ లిమా ట్వీట్ చేశారు. విమాన ప్రమాదం నుంచి ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని స్థానిక మీడియా వెల్లడించింది. .
కూలిపోయిన ఈ విమానం EMB-110 మోడల్ కు చెందినది. బ్రెజిల్ విమానాల తయారీ సంస్థ ఎంబ్రేయర్ ఈ విమానాలను తయారు చేస్తోంది. Manaus Aerotaxi ఎయిర్‌లైన్ అనే కంపెనీ ఈ విమానాన్ని టూరిస్టులకు అద్దెకు ఇచ్చింది. అమెజానోస్ రాష్ట్ర రాజధాని మనౌస్ నుంచి ఉత్తర అమెజాన్ ప్రావిన్సులు బార్సిలోస్‌కు 18 మంది ప్రయాణికులతో బయలుదేరింది . మనౌస్ సిటీ నుంచి బార్సిలోస్ కు 90 నిమిషాల వ్యవధిలో విమానంలో (Plane Crash) చేరుకోవచ్చు. విమానం ఎందుకు కూలింది ? కూలడానికి ముందు విమానంలో ఏం జరిగింది ? సాంకేతిక కారణాలు ఏమిటి ? అనే వివరాలపై దర్యాప్తు చేస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో అమెరికా పౌరులు కూడా ఉన్నారు. అయితే మార్గం మధ్యలో విమానం ఎలా క్రాష్ అయింది ? అనే దానిపై ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.
Also Read :- ఓ మైగాడ్... ఈ పుచ్చకాయ ధర కిలో రూ. 20 లక్షలు..
మనౌస్ ఏరోటాక్సీ విమానం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా స్పోర్ట్స్ ఫిషింగ్ కోసం ఈ ప్రాంతానికి వెళుతున్న బ్రెజిలియన్లు అని రాష్ట్ర భద్రతా కార్యదర్శి వినిసియస్ అల్మేడా పేర్కొన్నారు. బాధితుల్లో అమెరికా పౌరులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సాంకేతిక లోపం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.