ఓ మైగాడ్... ఈ పుచ్చకాయ ధర కిలో రూ. 20 లక్షలు..

ఓ మైగాడ్... ఈ పుచ్చకాయ ధర కిలో రూ. 20 లక్షలు..

పుచ్చకాయ చాలా ఆరోగ్యకరమైన ఫుడ్... ఇది రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు అద్భుతంగా పని చేస్తుంది.  సాధారణంగా  పుచ్చకాయ  కిలో   50 నుంచి 60 రూపాయల వరకు ఉంటుంది.  కాని ఓ దేశంలో మాత్రం  Watermelon కేజీ 20 లక్షల రూపాయిల ధర పలికింది.  ఈ పుచ్చపండు ప్రత్యేకతలేమిటో తెలుసుకుందాం. . . 

ఆరోగ్య ప్రయోజనాల రీత్యా పండ్లను ఎక్కువగా తింటారు. డాక్టర్లు కూడా ఇదే చెబుతుంటారు. అలాంటి పండ్లు ఎన్నో రకాలు.. వాటిల్లో ఒకటి పుచ్చకాయ. చాలా మందికి ఇష్టమైనది. అందరికీ ఇష్టమైనది పుచ్చకాయ. ఇందులో మెలోన్ పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు అద్భుతంగా పని చేస్తుంది. అయితే, పుచ్చకాయ కిలోకు రూ. 100లోపుగానే మార్కెట్‌లో దొరుకుతుంది. కానీ ఓ దేశంలో  పుచ్చకాయ ధర తెలిస్తే.. షాక్‌ అవుతారు.. దాని ధర చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. 

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వెరైటీలలో ఒకటైన ఈ పుచ్చకాయ ఖరీదు చాలా కాస్ట్లీ. ఈ ప్రత్యేకమైన పుచ్చకాయను జపాన్‌లో  పండిస్తారు. దీనిని యుబారి కింగ్ అని పిలుస్తారు. ఇది జపాన్‌లోని హక్కైడో ద్వీపంలోని యుబారి నగరంలో మాత్రమే పండించబడే ప్రపంచంలోనే అత్యంత విలువైన పండు.. ఇక్కడి నగర వాతావరణం యుబారి పుచ్చకాయ సాగుకు అనువైనది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

 యుబారి నగరంలో పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల కారణంగా యుబారి కింగ్ దాని అసాధారణమైన తీపి, రుచిని కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రతలో ఎక్కువ వ్యత్యాసం ఉంటే, పుచ్చకాయ తియ్యగా, రుచిగా మారుతుంది. యుబారి కింగ్‌ కున్న ఈ ప్రత్యేకతల కారణంగా దీనిని అమ్మడమే కాకుండా వేలం కూడా వేస్తారు.  2022 సంవత్సరంలో ఒక యుబారి కింగ్‌ పుచ్చకాయ వేలంలో  కిలో  20 లక్షల రూపాయిలతో  ఆశ్చర్యకరమైన ధర పలికింది.  అంతకు ముందు సంవత్సరం ఒక యుబారి కింగ్ పుచ్చకాయ ధర రూ.18 లక్షలకు అమ్ముడుపోయింది.  మనదేశంలో SUV Mahinda థార్ ధర రూ. 12 నుండి 20 లక్షల మధ్య ఉంటుంది.

యుబారి కింగ్ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంది. ఇది యాంటీ ఇన్ఫెక్షన్ ఫ్రూట్‌గా పరిగణించబడుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దాని పొటాషియం కంటెంట్‌తో పాటు, ఇందులో విటమిన్ సి, ఫాస్పరస్, విటమిన్ ఎ, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.