
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఘటన
గుండాల, వెలుగు : డెంగ్యూతో ఓ స్టూడెంట్ చనిపోయింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన ఇరప శాలిని, కిశోర్ దంపతుల కూతురు ప్రవళిక (17) హైదరాబాద్‌లో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతోంది.
రెండు రోజులుగా ప్రవళిక జ్వరంతో బాధపడుతుండగా.. తల్లిదండ్రులు హైదారాబాద్ వెళ్లి ప్రవళికను ఖమ్మం తీసుకొచ్చి ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. అక్కడ బ్లడ్ టెస్ట్‌లు చేసిన డాక్టర్లు డెంగ్యూగా నిర్ధారించారు. ఈ క్రమంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ప్రవళిక సోమవారం చనిపోయింది