
- చీఫ్ గెస్టుగా ప్రొఫెసర్ ఉమా కాంజీలాల్
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోవత్సవం మంగళవారం జరగనున్నది. ఈ కార్యక్రమానికి వర్సిటీ చాన్సలర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు చీఫ్ గెస్టుగా ఇగ్నో వర్సిటీ వీసీ ఉమా కాంజీలాల్ అటెండ్ కానున్నారు.
యూనివర్సిటీ క్యాంపస్ లోని భవనం వెంకట్రామ్ ఆడిటోరియంలో ఉదయం ప్రోగ్రామ్ ప్రారంభంకానున్నది. ఈ స్నాతకోత్సవంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, విద్యావేత్త ప్రేమ్ రావత్ కు డాక్టర్ ఆఫ్ లెటర్స్ ప్రదానం చేయనున్నారు. స్నాతకోత్సవంలో వివిధ జైళ్లలో ఉండి చదువుకున్న 203 మంది పట్టాలు పొందనున్నారు. వర్సిటీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 5,91,030 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు.