8 ఏళ్లలో 325% లాభం: సావరిన్ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్ రేటును ప్రకటించిన RBI...

8 ఏళ్లలో 325% లాభం:  సావరిన్ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్ రేటును ప్రకటించిన RBI...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2017-18 సిరీస్ IV కింద జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ల (SGBs) మెచ్యూరిటీ రేటు, తేదీని ప్రకటించింది. అయితే మెచ్యూరిటీ తేదీ  23 అక్టోబర్ 2025గా నిర్ణయించింది. ఫైనల్ పేమెంట్ రేటు SGB యూనిట్‌కు రూ.12,704. SGB యూనిట్‌ అంటే ఒక గ్రాము బంగారానికి సమానం

SGB  రేటు లెక్కింపు ఎలా అంటే : ఈ ధరను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, మెచ్యూరిటీ తేదీకి  మూడు రోజుల ముందు అంటే 17, 20, 22 అక్టోబర్ 2025న 999 స్వచ్ఛతగల బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా లెక్కిస్తారు.

SGB 2017-18 సిరీస్ IV కొనుగోలు ధర: ఈ బాండ్‌ను 23 అక్టోబర్  2017న ఒక గ్రాముకు రూ.2,987 చొప్పున జారీ చేశారు. RBI నిర్ణయించిన మెచూరిటీ ధర రూ.12,704 కాబట్టి, పెట్టుబడిదారుడికి వచ్చిన మొత్తం లాభం రూ.9,717 అంటే రూ.12,704 - రూ.2,987 అన్నమాట. ఆన్‌లైన్‌లో కొని డిజిటల్‌గా డబ్బు చెల్లించిన వారికి కొనుగోలు ధర గ్రాముకు రూ.2,937 మాత్రమే. వారికి లాభం ఇంకాస్త ఎక్కువ ఉంటుంది.

325% లాభం: రూ.9,717 లాభం అంటే 325 శాతం రాబడి అని. ఇది కాకుండా, SGB బాండ్ పెట్టుబడిదారులు 8 ఏళ్ల కాలంలో ఆరు నెలలకు ఒకసారి 2.5 శాతం అదనంగా  ఏడాది వడ్డీని కూడా పొందారు.

SGBల వల్ల ప్రయోజనాలు ఏంటి : SGB మెచూరిటీ అయిన డబ్బు ఆటోమేటిక్‌గా పెట్టుబడిదారుడి బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. ఈ బాండ్ల మెచ్యూరిటీపై వచ్చే లాభం (Capital Gains Tax)పై ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. RBI జారీ చేసిన ఈ గోల్డ్  బాండ్లను లోన్ తీసుకోవడానికి బ్యాంకులలో హామీగా(Surety) కూడా ఉపయోగించుకోవచ్చు.