నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్: రైల్వేలో 50 వేల ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..!

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్: రైల్వేలో 50 వేల ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..!

నిరుద్యోగులకు రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇప్పటికే 9వేలకు పైగా నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపింది. త్వరలోనే మిగితా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని వెల్లడించింది. 

రైల్వే రిక్రూట్‎మెంట్ బోర్డు (ఆర్ఆర్‎బీ) ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్షలు నిర్వహిస్తామంది. టెక్నికల్, నాన్-టెక్నికల్, మినిస్టీరియల్, లెవల్-1, ఇతర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

►ALSO READ | కంపెనీ సెక్రటరీ కోర్స్ చేశారా..? ఐసీఎస్ఐలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోండి..

అభ్యర్థులు తమ ప్రాంతంలోని ఖాళీలు, నోటిఫికేషన్ల వివరాల కోసం అధికారిక ఆర్ఆర్‎బీ వెబ్‌సైట్‌లను చెక్ చేయాలి. అభ్యర్థుల ఇళ్లకు దగ్గర్లోనే పరీక్ష కేంద్రాలను కేటాయించడానికి ప్రయత్నిస్తున్నామని ఆర్ఆర్ బీ పేర్కొంది. మహిళా అభ్యర్థులు, దివ్యాంగులు ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా దగ్గర్లోనే ఎగ్జామ్ సెంటర్లను కేటాయిస్తామంది. ఉద్యోగాల వివరాలు, అర్హతలు, వేతనం, వయోపరిమితి వంటి వివరాలను నోటిషికేషన్లో స్పష్టంగా తెలియజేస్తామని పేర్కొంది ఆర్ఆర్‎బీ.