ఉద్యోగం పోయిందనుకుంటే.. జాక్‌పాట్! కేవలం 24 నెలల్లో కోట్లు కొల్లగొట్టిన 21 ఏళ్ల మోడల్..

 ఉద్యోగం పోయిందనుకుంటే.. జాక్‌పాట్! కేవలం 24 నెలల్లో  కోట్లు కొల్లగొట్టిన 21 ఏళ్ల మోడల్..

అమెరికన్ ఓన్లీఫ్యాన్స్ కంటెంట్ క్రియేటర్ అయిన సోఫీ రెయిన్ కేవలం రెండు ఏళ్లలో సబ్‌స్క్రిప్షన్ ద్వారా సుమారు 9 కోట్ల 50 లక్షలు ($95 మిలియన్ల) కంటే ఎక్కువ సంపాదించినట్లు చెప్పడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

సోఫీ రెయిన్ ఆమె సంపాదన వివరాల స్క్రీన్‌షాట్‌ను Xలో షేర్ చేస్తూ ఇక్కడ రెండు ఏళ్ళు పనిచేసినందుకు థాంక్స్ అని పోస్ట్ చేసింది. జూన్ 2023 నుండి నవంబర్ 2025 వరకు ఆమె మొత్తం సంపాదన $95,005,586.26గా అని అందులో ఉంది.

సోఫీ రెయిన్ కథ ఆమె సంపాదించిన డబ్బుకి మాత్రమే కాదు, ఆమె జీవితంలో జరిగిన అనుకోని మలుపులు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. సోఫీ రెయిన్ ఓన్లీఫ్యాన్స్‌లో చేరడానికి ముందు ఆమె ఒక వెయిట్రెస్‌గా అంటే హోటల్‌లో ఫుడ్ సర్వ్ చేసే ఉద్యోగిగా పనిచేసేది. ఓన్లీఫ్యాన్స్‌లో కెరీర్‌ ప్రారంభించడానికి కొద్దిరోజుల ముందు ఆమె ఉద్యోగం పోయింది. 

ALSO READ : 1000 మంది ఉద్యోగులను లండన్ ట్రిప్‌కి తీసుకెళ్తున్న చెన్నై కంపెనీ

 అంతకుముందు 2024 మొదటి ఏడాదికే దాదాపు $43 మిలియన్లు (4 కోట్ల 30 లక్షలు) సంపాదించినట్లు  చెప్పగానే  ఇంటర్నెట్ షాకైంది. ఫ్లోరిడాకు చెందిన సోఫీ  రెయిన్ చిన్నతనంలో పేదరికాన్ని అనుభవించానని, ఫుడ్ స్టాంపుల(food stamps)పై పెరిగానని చెప్పింది. ఇప్పుడు మయామిలో ఉంటూ, తన సంపాదనతో మొత్తం కుటుంబాన్ని పోషిస్తున్నట్లు చెప్పింది.

దీనిపై ఒక నెటిజన్ సాధారణ ఉద్యోగాలు చేసే మనం 9-5 గంటలు కష్టపడుతుంటే, ఈ సోఫీ స్పైడర్ మ్యాన్ వీడియోలు, బైబిల్ శ్లోకాలు పోస్ట్ చేస్తూ కోట్లు సంపాదిస్తుంది అని అనగా.... మరొకరు నేను ఇప్పటివరకు ఓన్లీఫ్యాన్స్‌కు డబ్బులు కట్టే వారిని ఒక్కరినీ చూడలేదు, అయినా నా 24 ఏళ్ల జీవితంలో నేను సంపాదించిన దానికంటే నువ్వు ఒక్కరోజులోనే ఎక్కువ డబ్బు సంపాదించావు అని కామెంట్స్ చేసారు.