మొదటి మహిళా జవాన్ కి ఘన స్వాగతం

V6 Velugu Posted on Sep 23, 2021

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత సైన్యానికి ఎంపికైన మొదటి మహిళా జవాన్ శిక్షణ పూర్తి చేసుకుని సొంతూరుకు తిరిగివచ్చిన సందర్భంగా స్థానికులు ఘన స్వాగతం పలికారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఓం ప్రకాష్ యాదవ్ కూతురు కంచన్ యాదవ్ ఆర్మీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఎంపికైంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బైకంత్ పూర్ లో ఉన్న  ఎస్.టి.సి ట్రైనింగ్ సెంటర్ లో తన ఆర్మీ శిక్షణ విజయవంతంగా  పూర్తి చేసుకుని గురువారం సొంతూరు కాగజ్ నగర్ కు విచ్చేసింది. పట్టణంలోని  రిటైర్డ్ ఆర్మీ సంఘం వారు కంచన్ యాదవ్ కు ఘన స్వాగతం పలికారు. కొమురం భీం జిల్లా నుండి ఒక మహిళ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో చేరడం ఇదే ప్రథమం అని, ఈమె ఎంపిక యావత్ బాలికలకు, మహిళలకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని రిటైర్డ్ జవాన్లు సంతోషం వ్యక్తం చేశారు. 
 

Tagged kagajnagar, , Komurambheem district, Komurambhim Asifabad district, female jawan Kanchan Yadav, retired army jawan om prakash

Latest Videos

Subscribe Now

More News