నవంబర్ 1 నుండి ఆధార్ కొత్త రూల్స్.. అడ్రస్ మార్పుల నుండి బయోమెట్రిక్ వరకు చార్జెస్ ఇవే..

 నవంబర్ 1 నుండి  ఆధార్ కొత్త రూల్స్.. అడ్రస్ మార్పుల నుండి  బయోమెట్రిక్ వరకు చార్జెస్ ఇవే..

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ అప్‌డేట్ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా చేయబోతోంది. దింతో  నవంబర్ 2025 నుండి మీ పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఆన్‌లైన్‌లో మార్చుకోవడం మరింత సులభం కానుంది. దీని వల్ల ఆధార్ సర్వీస్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.

ఆధార్ అప్‌డేట్‌ ఆన్‌లైన్‌లోనే: నవంబర్ 1 నుండి ఆధార్ వినిగయోగదారులు వ్యక్తిగత వివరాలను అంటే పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నంబర్ పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త పద్ధతిలో డేటా వెరిఫికేషన్ కోసం పాన్ లేదా పాస్‌పోర్ట్ వంటి లింక్ చేసిన ప్రభుత్వ రికార్డులను ఉపయోగిస్తారు. దీనివల్ల డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదా ఆధార్ సెంటరుకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది.

ALSO READ : మారిన SBI క్రెడిట్ కార్డ్ రూల్స్.. 

బయోమెట్రిక్ అప్‌డేట్‌లు: వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌ లేదా ఫోటోలతో సహా బయోమెట్రిక్ వివరాలను మార్చడానికి మాత్రం తప్పనిసరిగా ఆధార్ సర్వీస్  సెంటరుకు వెళ్లాల్సి ఉంటుంది.

ఆధార్ చార్జెస్: ఆధార్ వివరాలు మార్పులు, ఆధార్ అప్‌డేట్‌ల కోసం  UIDAI  కొత్త ఛార్జీలను ప్రకటించింది. పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ మొదలైన సమాచారం మార్పుల కోసం రూ. 75, బయోమెట్రిక్ వివరాల అప్ డేట్ అంటే వేలిముద్రలు, ఐరిస్ స్కానింగ్ కోసం రూ. 125. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లు అప్‌డేట్ చేయడం  14 జూన్  2026 వరకు ఉచితం. ఆ తర్వాత ఈ ఛార్జీలు వర్తిస్తాయి.

పిల్లలకు ఫ్రీ: 5 నుండి 7, 15 నుండి 17 ఏళ్ల  మధ్య వయస్సు ఉన్న పిల్లలు ఉచితంగా బయోమెట్రిక్ అప్‌డేట్‌లు చేసుకోవచ్చు. 

 ఆధార్-పాన్ లింక్ తప్పనిసరి: ఆధార్ పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి కాబోతోంది. మీ  పాన్ కార్డు డిఅక్టీవెషన్  కాకుండా ఉండాలంటే 31  డిసెంబర్ 2025 లోపు ఆధార్-పాన్‌ లింక్ చేయాలి. ఈ గడువు తర్వాత అంటే 1 జనవరి  2026 నుండి లింక్ చేయని పాన్ కార్డులు పనిచేయకుండా అవుతాయి.  కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసేటప్పుడు కూడా ఆధార్ అతేంటికేషన్(Authentication) తప్పనిసరి.

e-KYC : బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా వేగంగా పేపర్ లెస్ వెరిఫికేషన్  కోసం OTP, వీడియో కాల్స్ లేదా పర్సనల్  ఆధార్ కన్ఫర్మేషన్ వంటి  e-KYC పద్ధతులను పాటించాలని కోరారు. 14 జూన్ 2026 వరకు ఆన్‌లైన్ ఆధార్ అప్ డేట్ ఉచితం. ఎటువంటి చార్జెస్ లేకుండా మార్పులు చేసుకోవచ్చు. అయితే, ఆన్‌లైన్ అప్‌డేట్ కోసం మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి.