మారిన SBI క్రెడిట్ కార్డ్ రూల్స్.. కొత్త ఛార్జీల గురించి వెంటనే తెలుసుకోండి

మారిన SBI క్రెడిట్ కార్డ్ రూల్స్.. కొత్త ఛార్జీల గురించి వెంటనే తెలుసుకోండి

ఇవాళ నవంబర్ నెల ప్రారంభమైంది. దీంతో కొత్త నెలలో ప్రతి నెల మాదిరిగానే బ్యాంకింగ్ నుంచి క్రెడిట్ కార్డ్స్ వరకు అనేక అంశాలకు సంబంధించిన రూల్స్ మారిపోయాయి. ఈ క్రమంలో నవంబర్ మాసంలో వచ్చిన కొత్త క్రెడిట్ కార్డ్ నిబంధనలు కస్టమర్లపై వాటి ప్రభావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

కొత్త నెల ప్రారంభం నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాకిచ్చే కొత్త రూల్స్ అమలులోకి తీసుకొచ్చింది. ఇకపై SBI క్రెడిట్ కార్డ్ కస్టమర్లు తమ క్రెడిట్ కార్డు ఉపయోగించి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే ఎడ్యుకేషన్ ట్రాన్సాక్షన్స్ పై 1% అదనపు ఛార్జీలు భరించాల్సి ఉంటుందని ప్రకటించింది. స్కూల్స్/కాలేజెస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లు లేదా POS మెషీన్‌ల ద్వారా డైరెక్ట్ గా  చేసే చెల్లింపులకు మాత్రం ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండబోవను స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపు వ్యయాలను బ్యాలన్స్ చేయాలని బ్యాంక్ భావిస్తోంది. 

ALSO READ : బ్యాంక్ అకౌంట్ నామినీ రూల్స్ మారాయి..

దీనికి తోడు బ్యాంక్ రూ.వెయ్యికి పైన చేపట్టే వాలెట్ లోడ్ ట్రాన్సక్షన్స్ కి కూడా 1% ఛార్జీలు వర్తిస్తాయని వెల్లడించింది. అంటే.. మీరు డిజిటల్ వాలెట్‌కు రూ.1,000 కంటే ఎక్కువ యాడ్ చేసుకుంటే.. ఆ మొత్తంలో 1% ఫీజుగా కట్ అవుతుంది. ఈ మార్పులను గుర్తుంచుకుని చివరి నిమిషంలో వచ్చే ఇబ్బందులను నివారించుకోండి. 

ఒకపక్క ఎస్‌బీఐ తన క్రెడిట్ కార్డు ద్వారా చేపట్టే ఎడ్యుకేషన్, ప్రభుత్వ బిల్లు, రెంట్ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు నిలిపివేయగా.. పరిమితి దాటి చేపట్టే భారీ చెల్లింపులపై 1 శాతం ఫీజు విధిస్తున్నారు. ఇక ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం అయిన HDFC బ్యాంక్ ఫ్యూయెల్ ట్రాన్సాక్షన్లు, బిల్లు చెల్లింపులపై అదనపు ఫీజులు అమలు చేయటం ఖాతాదారుల జేబుపై కొత్త భారాన్ని మోపుతోంది. యూజర్లు.. ఇకపై ఈ మార్పులను గమనించి దానికి తగినట్లుగా మీ ప్లానింగ్ చేసుకోండి.