- ట్యాక్స్ ఇన్స్పెక్టర్ను విచారించిన అధికారులు
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ జోనల్ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ట్యాక్స్ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేస్తున్నాడని ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్సీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగేండ్ల కింద ఇల్లు కొనుగోలు చేశాడు. ట్యాక్స్ అసైస్మెంట్ కోసం ఇన్స్పెక్టర్ వహీద్ రూ.2.50 లక్షల ట్యాక్స్ నోటీసులు ఇచ్చాడు. దీంతో సదరు వ్యక్తి ట్యాక్స్ ఎక్కువ ఉందని అనడంతో, ట్యాక్స్ తగ్గించండతో పాటు యజమాని పేరు మార్పు కోసం రూ. లక్ష డిమాండ్ చేశాడు.
అంత ఇవ్వలేనని అనడంతో రూ.90 వేలు డిమాండ్ చేశాడు. ముందుగా రూ.10 వేలు తీసుకున్న అనంతరం మిగిలిన రూ.80 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి, దానిని రూ.75 వేలకు తగ్గించాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు ట్యాక్స్ ఇన్స్పెక్టర్ను విచారించారు. ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారణ చేపట్టామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విచారణ కొనసాగింది.
