V6 News

హరీశ్ రోడ్డు షోలో ఈటలకు జై కొట్టిన కార్యకర్తలు

హరీశ్ రోడ్డు షోలో ఈటలకు జై కొట్టిన కార్యకర్తలు

హుజురాబాద్ ఇల్లందుకుంట మండలం హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో ఈటలకు జై కొట్టారు టీఆర్ఎస్ నాయకులు. రాచపల్లిలో రోడ్ షోలో ఈటల రాజేందర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదం ఇవ్వడం.. కింద ఉన్న కార్యకర్తలు జై కొట్టడం జరిగిపోయింది. అదే ప్రచార వాహనంలో ఉన్న మంత్రి హరీశ్ రావు..అలవాట్లో పొరపాటు అంటూ సర్దేశారు. 15 ఏళ్ల దోస్తాన ఆమాత్రం ఉంటుందని కవర్ చేశారు హరీశ్ రావు.

స్వార్థం కోసం  ఈటల రాజేందర్  రాజీనామా  చేశారన్నారు  మంత్రి హరీశ్ రావు. అమ్మకాల బీజేపీకి,  నమ్మకాలు నిలబెట్టుకున్న  టీఆర్ఎస్ కు మధ్య  జరుగుతున్న  ఎన్నికలని తెలిపారు. కరీంనగర్ జిల్లా  ఇల్లందకుంట మండలం  రాచపల్లి ప్రచారంలో  పాల్గొన్నారు  హరీశ్ . ప్రజల కోసం ప్రభుత్వం  చాలా  సంక్షేమ పథకాలు  తీసుకొచ్చిందన్నారు.  మంత్రిగా  ఒక్క ఇళ్లు  కట్టని ఈటల ....ప్రతిపక్ష  ఎమ్మెల్యేగా   రేపు కట్టించగలుగుతారా  ఆలోచించాలన్నారు.  ఈటల అన్ని అసత్య ప్రచారాలు  చేస్తున్నారన్నారు హరీశ్ రావు.