కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రైవేట్ స్కూళ్లలో నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్స్ పేరిట దోపిడీ చేస్తుంటే, చర్యలు తీసుకోవాల్సిన డీఈవో వారితో కుమ్మక్కై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి ఆరోపించారు. శుక్రవారం డీఈవో వ్యవహారానికి నిరసనగా డీఈవో ఆఫీస్ ఎదుట తరాజులో నోట్లకట్టలు, పుస్తకాలతో ఏఐఎస్‌ఎఫ్ లీడర్లు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఈఓ అండతోనే విద్యతో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారన్నారు. ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి సహకరిస్తున్న డీఈవో, ఎంఈవోలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస్ నాయక్, లీడర్లు సందీప్ రెడ్డి, జ్యోష్ణ, అనోష్, విష్ణు, జ్ఞానేశ్వర్, నవీన్, నిఖిల్ పాల్గొన్నారు.
