చనాక-కోరట బ్యారేజీకి మాజీ మంత్రి సీఆర్ఆర్ పేరు

చనాక-కోరట బ్యారేజీకి మాజీ మంత్రి  సీఆర్ఆర్ పేరు

–ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లాలోని చనాక–కోరట బ్యారేజీకి మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి(సీఆర్ఆర్) పేరు పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు నరేశ్​ జాదవ్​తెలిపారు.

జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమించిన మాజీ మంత్రి పేరును బ్యారేజీకి పెట్టడంతో జిల్లా ప్రజలు, కాంగ్రెస్​ శ్రేణుల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఙతలు తెలిపారు.