సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్ధిపేట జిల్లాలో యాసంగి సీజన్‌లో లక్ష్యానికి మించి వడ్లు కొన్నట్లు కలెక్టర్ కె.హైమవతి తెలిపారు. ఈసారి జిల్లా4.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం కాగా.. 5,04,161 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 97,807 మంది రైతుల నుంచి రూ.1,204 కోట్ల విలువైన ధాన్యం కొనగా.. ఇప్పటివరకు రూ.1,036 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ ఆధ్వర్యంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టడంతో కొనుగోళ్లు సజావుగా సాగాయని తెలిపారు. అనంతరం సిద్దిపేట క్రికెట్ స్టేడియంను సందర్శించి 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.
