వాట్సాప్ లో టెక్నికల్ గ్లిచ్.. ప్రపంచ వ్యాప్తంగా వేలాది వాట్సాప్ ఖాతాలు తొలగించారు. ఆడియో వీడియో కాల్స్, మేసేజ్ లు అన్ని బంద్ అయ్యాయి. దీంతో పర్సనల్ ఖాతాలతోపాటు బిజినెస్, ఉద్యోగ కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడింది. ఏమైందో తెలియని యూజర్లు అయోమయానికి గురయ్యాయి. అయితే టెక్నికల్ సమస్యతో పొరపాటున ఈ ఖాతాలు తొలగించారు.. తిరిగి ఖాతాలను పునరుద్దరించడం ప్రారంభించినట్టు మెటా ప్రకటించింది.
వాట్సాప్ ఆటోమేటెడ్ మోడరేషన్ సిస్టమ్‌లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి కంప్లైంట్స్ లేని ఖాతాలను కూడా సిస్టమ్ పొరపాటున అనుమానాస్పదంగా గుర్తించి, రివ్యూ కోసం నిలిపివేసినట్లు మెటా తెలిపింది.
ఆగస్టు 3న ఈ సమస్య తలెత్తడంతో పలువురు యూజర్లు తమ వాట్సాప్ ఖాతాలను ఉపయోగించలేకపోయారు. మెసేజ్‌లు పంపడం, స్వీకరించడం ఆగిపోవడంతో వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అన్ని నిలిచిపోయాయి. దీంతో వ్యాపార, ఉద్యోగ కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడింది.
చాలా మంది వినియోగదారుల ఫోన్లలో వారి ఖాతా రివ్యూలో ఉంది అనే నోటిఫికేషన్ కనిపించింది. ఖాతా, డివైజ్ యాక్టివిటీని పరిశీలిస్తున్నామని వాట్సాప్ తెలిపింది. అయితే ఖాతాలను ఎందుకు నిలిపివేశారనే కారణాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు.
ALSO READ : రోడ్డు భద్రతకు స్మార్ట్ టెక్నాలజీ..
ఈ సమస్యపై పలువురు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేశారు. తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.
మెటా ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించి, ప్రభావిత ఖాతాలకు తిరిగి యాక్సెస్ కల్పించే ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది. అయితే ఈ సమస్యకు అసలు కారణంపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు.
