
- కేసీఆర్పక్కనున్న కోవర్టులెవరో
- కవిత చెప్పాలి: ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరో చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు. కేసీఆర్ పక్కనున్న కోవర్టులెవరో ఆమె చెప్పాలన్నారు. శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత మీడియాతో మాట్లాడిన అనంతరం ఆది శ్రీనివాస్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
అందులో ‘‘ మీ లేఖ ను లీక్ చేసింది ఎవరు? కేసీఆర్ దేవుడు అయితే.. దయ్యం ఎవరు? కేసీఆర్ పక్కన ఉన్న కోవర్టులు ఎవరు? బీఆర్ఎస్ లో మీపైన కుట్ర చేస్తున్నది ఎవరు? సొంత తండ్రిని కలిసి మాట్లాడకుండా లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? మీకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీ లేదా? ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు? లేఖ లీక్ కావడం పైన వివరణ ఇవ్వాలని కేసీఆర్ ని అడుగుతారా? మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఇంత జరుగుతుంటే మీ కుటుంబం ఎందుకు మీకు అండగా నిలబడటం లేదు? ఎయిర్ పోర్టులో మీకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ నేతలు ఎందుకు రాలేదు? మీ లేఖ నకిలీదని మీ సొంత పత్రిక నమస్తే తెలంగాణలో రాయించింది ఎవరు?” అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలన్నింటికీ ఎమ్మెల్సీ కవిత సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్డిమాండ్ చేశారు.