కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నాం : గుడ్ న్యూస్ చెప్పిన మైక్రోసాఫ్ట్ సీఈవో

కొత్త ఉద్యోగులను తీసుకుంటున్నాం : గుడ్ న్యూస్ చెప్పిన మైక్రోసాఫ్ట్ సీఈవో

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారీగా ఉద్యోగులను తొలగించిన  తర్వాత, ఇప్పుడు మళ్లీ కంపెనీ కొత్త ఉద్యోగుల నియామకాలకు సిద్ధంగా ఉందని ప్రకటించారు.  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, AI విప్లవం రాకముందు ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో భవిష్యత్తులో కూడా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని, కానీ ఈసారి నియామకాలు చాలా తెలివిగా, ఎక్కువ పనులు చేయగలిగే మార్గంలో పెరుగుతారని సత్య నాదెళ్ల అన్నారు.

అంటే, ఎక్కువ మందిని తీసుకోవడం కంటే తక్కువ మందితోనే AI సాయంతో ఎక్కువ పనులు చేయించడం అనే కొత్త విధానాన్ని కంపెనీ అనుసరిస్తోందని అన్నారు. ప్రస్తుతం, మైక్రోసాఫ్ట్‌లో ఏ ప్లాన్ అయినా, ఏ పని మొదలుపెట్టినా, అది AI తోనే స్టార్ట్ అవుతుంది. మీరు AIతోనే ఆలోచిస్తారు, పరిశోధన చేస్తారు, సహోద్యోగులతో షేర్ చేసుకుంటారు అని వివరించారు.

మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్ వంటి AI టూల్స్‌ని  ప్రతి ఉద్యోగి ఉపయోగించాలని కంపెనీ భావిస్తుంది. అంతేకాకూండా మైక్రోసాఫ్ట్‌లో AI కేవలం కొత్త ప్రొడక్టులకు మాత్రమే కాదు, కంపెనీ పని చేసే విధానాన్నే మార్చేస్తోంది. ఈ AI మార్పును పాత టెక్నాలజీతో పోల్చుతూ, ఒకప్పుడు ఆఫీస్ మెమోలు ఫ్యాక్స్ ద్వారా పంపేవారని, తర్వాత ఇమెయిల్, ఎక్సెల్ వంటివి వచ్చి అన్నీ మార్చేశాయని సత్య నాదెళ్ల గుర్తుచేశారు.

అయితే, ఈ మార్పు రావడానికి అంటే ఉద్యోగులందరూ AIని పూర్తిగా వాడుకోగలిగేలా మారడానికి, మరో ఏడాది పట్టవచ్చని ఆయన అంచనా వేయగా... కంపెనీలో ఎక్కువ మంది ఉద్యోగుల నియామకం ఉంటుందని చెప్పారు.