ఓయూ, వెలుగు: ఈ నెల 25న జరిగే ఏఐఎస్ఎఫ్ ఓయూ 25వ మహా సభను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఓయూ కౌన్సిల్ పిలుపునిచ్చింది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో సభను నిర్వహించనున్నట్లు పేర్కొంటూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేశ్ ఆధ్వర్యంలో సోమవారం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఓయూలో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి కోర్స్ ఫీజు లేకుండా, ఉచిత హాస్టల్, మెస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఓయూలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. యూనివర్సిటీకి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వర్సిటీ భూములను కాపాడాలని, ఓయూ పాలకమండలి ఏర్పాటు చేయాలని కోరారు.
