ఐశ్వర్య రాయ్ దుస్తులపై దారుణంగా ట్రోలింగ్.. 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌'లో చేదు అనుభవం

ఐశ్వర్య రాయ్ దుస్తులపై దారుణంగా ట్రోలింగ్.. 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌'లో చేదు అనుభవం

ప్రతి ఏడాదిలాగే ఈసారీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైలట్ గా నిలుస్తోన్న స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ వార్తల్లోకెక్కారు. తన అందం, లుక్స్ తో అందర్నీ ఆకర్షించే ఐష్.. ఈ సారి మాత్రం తాను రెడ్ కార్పెట్ పై నడుస్తున్న సమయంలో ధరించిన సిల్వర్ కేప్ గౌనుపై విపరీతమైన విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటికిమొన్న కేన్స్ చిత్రోత్సవంలో రెడ్ కార్పెట్ పై ఓ వింత డ్రెస్ తో కనిపించిన ఆమె.. డ్రెస్ నిండా పువ్వులు, ఆకులతో సందడి చేసింది. డిజైన్ కూడా సరిగ్గా కనిపించకపోవడంతో..  ఆమె దుస్తులు ధరించిందా, అలా పైపైన కప్పుకొని వచ్చిందా అనే సెటైర్లు కూడా వినిపించాయి.

ఇంతలోనే ఐశ్వర్యపై మరోసారి ట్రోలింగ్ మొదలైంది. అల్యూమినియం పూత పూసినట్టు ఉండే దుస్తులు ధరించిన ఆమె.. అదే రంగులో ఉన్న ముసుగు కూడా ధరించింది. ఈ డ్రెస్ చాలామందికి నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై మీమ్స్, ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె ధరించిన డ్రెస్సు ఒక రేకు చుట్టులా ఉందంటూ కొందరు విమర్శలకు దిగుతున్నారు. కేన్స్ చిత్రోత్సవంలో ఇలా లుక్స్ పరంగా ఐశ్వర్యరాయ్ ఫెయిల్ అవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒకప్పుడు ఆమె తన అందంతో, వస్త్రాలంకరణతో భారత్ బ్రాండ్ గా వెలిగిన ఐష్.. ఇప్పుడు ఆమె అందం తగ్గింది, డిజైన్స్ ఎంపికలోనూ టేస్ట్ తగ్గిందని కొందరు ఆరోపిస్తున్నారు.

 తన అందం, అప్పియరెన్స్ తో అబ్బురపర్చే దుస్తులు, మేకప్ తో పాటు హెయిర్ స్టైల్ కు కూడా న్యాయం చేసిన ఐశ్వర్య.. ఇప్పటివరకు రెండు దశాబ్దాలుగా కేన్స్ ఫిల్మ్ పెస్టివల్ కు హాజరవుతున్నారు. ఈ సారి 21వ అప్పియరెన్స్ ను పూర్తి చేసుకున్నారు.