
స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ కోసం క్యూ కట్టడమే కాదు.. వరుస అప్‌డేట్స్‌తో హోరెత్తిస్తున్నాయి కూడా. ఊహించని అప్‌డేట్స్‌తో తాము కూడా సర్‌ప్రైజ్ చేస్తామంటోంది ‘సర్కారు వారి పాట’ టీమ్. పరశురామ్ డైరెక్షన్‌లో 14 రీల్స్ ప్లస్, మైత్రి సంస్థలతో కలిసి మహేష్‌బాబు నిర్మిస్తున్న ఈ మూవీలోని మొదటి పాటను ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ‘కళావతీ’ అంటూ సాగే ఈ పాటకి సంబంధించిన విశేషాలను ఫిబ్రవరి 9, 11 తేదీల్లో ఒక్కొక్కటిగా రివీల్ చేస్తామంటూ మరింత క్యూరియాసిటీని పెంచుతున్నారు దర్శక నిర్మాతలు. సూపర్ స్టార్ సూపర్ ఆల్బమ్ కోసం సిద్ధంగా ఉండాలని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు. అంటే ఆ తేదీల్లో సాంగ్ ప్రోమో, గ్లింప్స్ రిలీజ్ చేస్తారని అర్థమవుతోంది. మహేష్, కీర్తి సురేష్‌ల మీద తీసిన ఈ రొమాంటిక్ పాట.. మెలోడీ సాంగ్ ఆఫ్ ద ఇయర్‌గా నిలుస్తుందంటున్నారు. సినిమాని సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేయనున్నారు.