చిరాకు తెప్పిస్తున్న చిట్టీల సెలబ్రేషన్స్.. చెన్నై vs లక్నో మ్యాచ్లో చిట్టీల వివాదంపై అంబటి రాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

చిరాకు తెప్పిస్తున్న చిట్టీల సెలబ్రేషన్స్.. చెన్నై vs లక్నో మ్యాచ్లో చిట్టీల వివాదంపై అంబటి రాయుడు స్ట్రాంగ్ వార్నింగ్

 

ఐపీఎల్ లో ప్లేయర్స్ చేసే రకరకాల సెలబ్రరేషన్స్ చూస్తుంటాం. కొందరు డ్యాన్స్ చేస్తుంటే.. కొందరు సైగలు చేస్తూ రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుంటారు. ప్రత్యర్థి జట్టులోని బ్యాటర్ అవుటవ్వగానే.. రకరకాల సైగలతో, సెలబ్రేషన్స్ తో ఫ్యాన్స్ ఈగోను సాటిస్ఫై చేస్తుంటారు. అలాంటి సెలబ్రేషన్ ఒకటి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 2026 మే 15వ తేదీన లక్నో vs చెన్నై మ్యాచ్ సందర్భంగా లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్ చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు వైరల్ గానూ, వివాదాస్పదంగా నూ మారాయి. 

లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్ 2026 ఐపీఎల్ లో తన ఫస్ట్ అప్పీరెన్స్ లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టి సర్ ప్రైజ్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ వికెట్లు తీసి భళా అనిపించుకున్నాడు. అదే క్రమంలో జేబులో నుంచి ఒక లెటర్ తీసి కెమెరాకు చూపిస్తూ.. అందరి దృష్టిలో పడ్డాడు. 

ఆకాశ్ ఫస్ట్ మ్యాచ్ లోనే రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 9 బంతులలో 13 రన్స్ చేసిన  కెప్టెన్ రుతురాజ్ ను ఔట్ చేశాడు. నికోలస్ పూరన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగే సమయంలో.. ఆకాశ్ జేబులోనుంచి చిన్న స్లిప్ తీసి సెలబ్రేట్ చేయడం స్టేడియం అంతా హోరెత్తేలా చేసింది. జేబులో నుంచి చిట్టీ తీసి కెమెరాకు చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అక్కి ఆన్ ఫైర్.. ఆకాశ్ కు తెలుసు.. టీ20లో వికెట్లు ఎలా పడగొట్టాలోనని ఆ చిట్టిలో రాసుంది. 

6వ ఓవర్ లో కూడా అదే జరిగింది. సంజు శాంసన్ అవుట్ అయినపుడు సేమ్ అలాంటి స్లిప్పేతీసి..సెలబ్రేట్ చేసుకున్నాడు. 31 రన్స్ దగ్గర వికెట్లు లేని చెన్నై.. 32 పరుగులకు రెండు వికెట్లు పడిపోవడం విశేషం. 

అంబటి రాయుడు ఫైర్:

సెలబ్రేషన్స్ పై అంబటి రాయుడు తీవ్రంగా మండిడ్డారు. మ్యాచ్ సందర్భంగా ఇలాంటి సెలబరేషన్స్    సరైన పద్ధతి కాదననారు. చిట్టీలను గ్రౌండ్ లోకి అనుమతించవ్దని కోరారు. చిట్టీలను, స్లిప్పులను గ్రౌండ్ లోకి అనుమతించవద్దని కొరాడు. ఇది కొందరికి ఎంటర్టైన్మెంట్ గా ఉంటే.. కొందరిని బాధిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించకూడదని.. ఐపీఎల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించాడు