శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం

V6 Velugu Posted on Aug 30, 2021

  • కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ

అమరావతి: కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి ఏపీ ప్రభుత్వం  మరోసారి లేఖ రాసింది. శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ఉత్పత్తి వెంటనే నిలిపేయాలని లేఖలో కోరింది. తాగునీటి అవసరాలు పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తోందంటూ కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలియజేసింది. ఉమ్మడి ప్రాజెక్టులలో సాగు, తాగునీటి అవసరాలను పరిగణించి విద్యుత్‌ ఉత్పత్తి చేయాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం వివరించింది. తెలంగాణ వాదన పూర్తి అసంబద్ధమని ఏపీ ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ జెన్‌కో చేస్తున్న విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది.
 

Tagged KRMB, Srisailam Dam, Krishna River, Krishna water, krishna river management board, ap today, , amaravati today, ap-ts water disputes, srisailam power generatin

Latest Videos

Subscribe Now

More News