ముషీరాబాద్, వెలుగు: రైతు రత్న అవార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ కృపాకర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏషియన్ పీజీపీఆర్ సొసైటీ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, తెలంగాణ అగ్రికల్చర్ఆఫీసర్స్ అసోసియేషన్ సహకారంతో ఈ అవార్డులు ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఔత్సాహిక రైతులు జిల్లాలోని సంఘం ప్రతినిధులు, మండల వ్యవసాయ అధికారులను కలిసి దరఖాస్తు అందించాలన్నారు. లేదా పోస్టు ద్వారా ఇంటి నంబర్1-4-298/4, వీధి నంబర్1, అశోక్ నగర్, హైదరాబాద్- 500020, మెయిల్ [email protected] ద్వారా ఈ నెల 18లోగా పంపించాలని సూచించారు.
