రాష్ట్ర స్థాయి హాకీ టోర్నీకి జిల్లా జట్టు ఎంపిక

రాష్ట్ర స్థాయి హాకీ టోర్నీకి జిల్లా జట్టు ఎంపిక

ఆర్మూర్​, వెలుగు: త్వరలో జరుగనున్న సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్రస్థాయి అండర్​ 19 హాకీ టోర్నీకి జిల్లా బాల బాలికల జట్టును శుక్రవారం ఆర్మూర్​లోని మినీ స్టేడియంలో ఎంపిక చేశారు. ఎంపిక పోటీలకు 55 మంది బాలురు,  45 మంది బాలికలు హాజరు కాగా ప్రతిభ కనబరిచిన 16 మందితో కూడిన తుది జట్టును ఎంపిక చేసినట్లు హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు.  ఎంపిక పోటీలను  పీడీ, పీఈటీలు డి.చిన్నయ్య, స్వామి, జకోరా, సడక్ నాగేష్, తోంపల్లి, స్వామి, నాగేష్, అంజు, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. 

జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్​ పోటీలో ప్రతిభ..  

ఆర్మూర్​ లోని మినీ స్టేడియంలో గురువారం జరిగిన జిల్లాస్థాయి సీఎం కప్ సాఫ్ట్​బాల్ టోర్నమెంట్ లో పురుషుల విభాగంలో ఆర్మూర్​, మహిళల విభాగంలో సుద్దపల్లి మండలాల జట్లు విజేతగా నిలిచాయి. జిల్లాకు చెందిన 8 మహిళల జట్లు, 8 పురుషుల జట్లు పాల్గొన్నాయని జిల్లా డీవైస్​స్​వో పవన్ కుమార్ తెలిపారు. పురుషుల విభాగంలో ప్రథమ బహుమతి ఆర్మూర్, ద్వితీయ బహుమతి తొర్లికొండ, తృతీయ బహుమతి కమ్మర్​ పల్లి, మహిళల విభాగంలో ప్రథమ బహుమతి సుద్ధపల్లి, ద్వితీయ బహుమతి  ఆర్మూర్, తృతీయ బహుమతి ముచ్కూర్  జట్లు సాధించాయని తెలిపారు. స్కూల్ హెడ్మాస్టర్​ లక్ష్మీనర్సయ్య, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, ఎం సుజాత పాల్గొన్నారు.