నెలకి 6 లక్షలు సంపాదిస్తూ.. 74 ఏళ్ల బామ్మా యూట్యూబ్ స్టార్‌గా సెన్సేషన్‌..

నెలకి 6 లక్షలు సంపాదిస్తూ.. 74 ఏళ్ల బామ్మా యూట్యూబ్ స్టార్‌గా సెన్సేషన్‌..

కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయడానికి వయస్సు ఎప్పుడు అడ్డు కాదు అని సుమన్ ధమానే నిరూపించింది. ఆమెకి ప్రస్తుతం  74 ఏళ్ళు. ఈ వయసులో కూడా యూట్యూబ్‌లోకి వచ్చి సెన్సేషన్ గా మారింది. మొదట్లో ఒక చిన్న ఆలోచన మనవడి సాయంతో ఆసక్తి, పట్టుదల, వంట చేసే అనుభవం ఒక అద్భుతమైన ప్రయాణానికి  పునాది పడింది. "ఆప్లి ఆజీ" అని పిలవబడే సుమన్, తన యూట్యూబ్ ఛానెల్‌కి  17.9 లక్షల సబ్‌స్క్రైబర్‌లను సంపాదించి, నెలకు దాదాపు రూ. 5 లక్షల నుండి రూ. 6 లక్షల వరకు సంపాదిస్తూ యూట్యూబ్ స్టార్‌గా మారింది.

 కుటుంబ సాయంతో : కుటుంబం సాయం చేస్తే ఎంత పెద్ద మార్పు వస్తుందో చెప్పడానికి సుమన్ ధమానే  డిజిటల్ ప్రపంచంలోకి రావడం ఒక ఉదాహరణ. ఇంటర్నెట్ గురించి అనుభవం లేకపోయినా, ఆమె తన మనవడు యష్ ఆమెను ఎంతో ప్రోత్సహించాడు. యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టడానికి అవసరమైన విషయాలలో యష్ ఆమెకు సాయం చేశాడు. యష్ మార్గదర్శకత్వంలో, సుమన్ ఈ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తన వంట స్కిల్స్, ముఖ్యంగా సాంప్రదాయ మహారాష్ట్ర వంటకాలను ప్రపంచానికి చూపించింది. 

 “ఆప్లీ ఆజీ” ఛానెల్ :
"ఆప్లి ఆజి" ఛానెల్ త్వరగా అందరికీ నచ్చడానికి ముఖ్య కారణం... సుమన్ ధమానే  వీడియోలలో చూపించే నిజాయితీ, ఆప్యాయత. ఆమె వంట చేసే విధానం సాంప్రదాయ వంటకాలు, ఇంట్లో తయారుచేసిన మసాలాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. ఇది ఆరోగ్యకరమైన, మంచి ఆహారం కోరుకునే ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. పావ్ భాజీ, కరేలే కి సబ్జీ (కాకరకాయ కూర) నుండి సాంప్రదాయ మహారాష్ట్ర స్వీట్ల వరకు సుమన్ వంటకాలు పాత జ్ఞాపకాలను, మంచి రుచిని అందిస్తాయి.

సుమన్ ధమానే యూట్యూబ్ స్టార్‌గా మారే ప్రయాణం అంత ఈజీ కాదు. మొదట్లో ఆమెకు కెమెరా ముందు మాట్లాడడానికి మొహమాటం ఉండేది, టెక్నికల్ సమస్యలు వచ్చాయి, ఒకసారి ఛానెల్  కూడా హ్యాక్ అయ్యింది. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. సుమన్ అన్ని సవాళ్లను ధైర్యంగా దాటుకుంటు కొత్త కంటెంట్‌తో, నిజాయితీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ప్రేమతో చేసే వంటకాలు అందరికీ నచ్చాయి. చివరికి, ఆమెకు యూట్యూబ్ నుండి సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది.

►ALSO READ | క్యాష్ లెస్ మ్యారేజ్ అంటే ఇదేనేమో.. పెళ్లిలో కానుకల కోసం క్యూఆర్ కోడ్ అంటించుకున్న పెళ్లి కూతురు తండ్రి

నేడు సుమన్ ధమానే కేవలం యూట్యూబ్ స్టార్ మాత్రమే కాదు,  సక్సెస్ సాధించడానికి వయస్సు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించే స్ఫూర్తి. ఆమె ఛానెల్ విజయం వల్ల, సాంప్రదాయ మసాలాల అమ్మకాలు వంటిని వ్యాపారాలు కూడా మొదలయ్యాయి. ఆమె సక్సెస్ కథ... పరిస్థితులకు తగ్గట్టు మారే శక్తి, కుటుంబ సాయం విలువ, డిజిటల్ ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అవకాశాలను చూపిస్తుంది.